The Desk… Eluru : సీఎస్ఆర్ నిధులతో మహిళలకు నైపుణ్య శిక్షణ – ఎంపీ మహేష్ కుమార్ కృషి

The Desk… Eluru : సీఎస్ఆర్ నిధులతో మహిళలకు నైపుణ్య శిక్షణ – ఎంపీ మహేష్ కుమార్ కృషి

🔴 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

సామాజిక బాధ్యత” మర్చిపోని ఎంపీ.. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు.

‎అభివృద్ధి పనులకు CSR నిధుల సాధనలో దూసుకెళుతున్న ఏలూరు ఎంపీ

మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం ఎంపీ ప్రత్యేక చొరవ.

కె.కోట మండలం, తడికలపూడి గ్రామంలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు.

ఏటా 400 మంది బాలికలు, మహిళలకు కంప్యూటర్ శిక్షణ.

యువత, మహిళల అభివృద్ధి కోసం ఎంపీ చేస్తున్న కృషికి ప్రశంసలు.

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉన్నా, అనేక సందర్భాల్లో నిధుల కొరతతో పనులు సవ్యంగా సాగని పరిస్థితులు  ఉంటాయి. కానీ మనసుంటే మార్గం ఉంటుందన్నట్లుగా “కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)” అనే అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తాను ఏలూరులో ఉన్నా, డిల్లీ పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నాసరే, చేయాలనుకున్న అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా చూసుకుంటూ కొత్త పంథాలో ముందుకు దూసుకుపోతున్నారు.గతంలోనే

2 కోట్ల Mp లాడ్స్ నిధులతో జిల్లాలోని 50 ప్రభుత్వ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్ పరికరాల అందజేసిన ఎంపీ, కొద్ది నెలల కిందట 1 కోటి విలువైన CSR నిధులు తీసుకువచ్చి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలను అందించారు. అదేవిధంగా కృత్రిమ మేధకు పెరుగుతున్న ప్రాధాన్యతను గ్రహించి, తన జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లోని విద్యార్దులకు కూడా అటువంటి టెక్నాలజీను నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఇటీవలే 2.5 కోట్ల CSR నిధులతో జిల్లాలోని 11 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో  AI లాబ్స్ ఏర్పాటు చేయించిన యువ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభివృద్ధికి కొత్త అర్థం చెబుతున్నారు.‎‎

ఎవరూ ఊహించని రీతిలో CSR నిధుల సాధనలో చాకచక్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి  ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తాజాగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ వారి నుంచి CSR నిధులు తీసుకువచ్చి కామవరపుకోట మండలం, తడికలపూడి గ్రామంలో శాశ్వత ప్రాజెక్టుగా ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. తడికలపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి మరియు మహిళ సాధికారిత కేంద్రంలో  ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఏలూరు

పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సంకల్పంతో, నేడు ఈ కేంద్రానికి అవసరమైన 12 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు UPS పరికరాలు అందాయి.‎‎డిజిటల్ యుగంలో మహిళలు మరియు బాలికలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో శరత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 400 మంది బాలికలు మరియు మహిళలకు కంప్యూటర్ శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించబడింది.త్వరలోనే

శిక్షణ కోసం బ్యాచ్‌లను నమోదు చేసి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా అధికారికంగా కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు శరత్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్లపట్ల సాయి శరత్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తడికలపూడి మరియు పరిసర ప్రాంతాల మహిళలు, బాలికలు డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి అవకాశాలను పొందేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని స్థానిక మహిళలు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను కూడా నగర యువతకు సమానంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే ఆశయంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేస్తున్న కృషికి వారు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.‎‎