The Desk … Kaikaluru : పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం : ఎంపీపీ అడవి కృష్ణ

The Desk … Kaikaluru : పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం : ఎంపీపీ అడవి కృష్ణ

ఏలూరు జిల్లా : వేమవరప్పాడు : ది డెస్క్ :

పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించడం ఎంతో అభినందనీయమని ఎంపీపీ అడివి కృష్ణమోహన్ అన్నారు. శనివారం మండలంలోని వేమవరపాడు యూపీ స్కూల్ లో నూతనంగా విద్యార్థుల భోజన వసతి కోసం ఏర్పాటు చేసిన షెడ్డును , కళా వేదికను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావడం హర్షనీయమన్నారు. సుమారు మూడు లక్షల ప్రజ విరాళాలతో షెడ్డు నిర్మించి పాఠశాల అభివృద్ధికి దోహదపడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా స్వార్థానికి పోకుండా విద్యార్థుల సౌకర్యం కోసం ఎంతో కష్టపడి విరాళాలు సేకరించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా షెడ్డును, కళా వేదికను నిర్మించి పాఠశాల అభివృద్ధికి కృషిచేసిన ప్రధానోపాధ్యాయులు వాసి సామ్రాజ్యమ్మ, తోటి ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎండిఓ కళావేదికను ప్రారంభించగా.. స్టేజ్ దాతలు బోయిన రాజు, గోవిందరాజు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నున్న రాంబాబు, ఎంఈఓ శ్రీనివాసరావు, పెద్దలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సేవా భావంతో పనిచేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొడవల లక్ష్మీనరసింహస్వామి, మాజీ ఉప సర్పంచ్ ఎరిచెర్ల అంతోని,ఉప సర్పంచి జాజుల రాజు, వార్డు సభ్యులు భట్రాజు నాగార్జున, బోడవుల సత్యనారాయణ , భూపతి రాజు, భూపతి జయరాజు, దాతలు సమ్మెట రామ సుబ్బారావు, మాడ నాగమల్లేశ్వరరావు, సబితి తంబి, బోడావుల జగదీష్, భూపతి తిమోతి, బడావుల పాండురంగారావు, అడవి ప్రసాద్, ఎర్రి చర్ల కిషోర్, ఉపాధ్యాయులు పి యు వి భాస్కర్ రావు, పి భాస్కరరావు, మహమ్మద్ అక్బర్ హుస్సేన్, ఎరిచెర్ల మోజెస్, రాయపు రెడ్డి శారదా దేవి, గాదంశెట్టి సీతామహాలక్ష్మి, ఎస్ దేవి భవాని తదితరులు పాల్గొన్నారు.