The Desk … Bhimavaram : ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం

The Desk … Bhimavaram : ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం

🟡 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పాత బస్టాండ్ ఆవరణంలో బస్సు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ సీతారాముల కళ్యాణం చేసి పానకము, ప్రసాదాలు భక్తులకు అందించారు.

సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ :

భీమవరం నియోజకవర్గంలో ప్రతి స్థలంలోనూ శ్రీరామనవమి ఘనంగా జరుగుతుందని, నియోజకవర్గంలోని ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుతూ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. పాత బస్టాండు ఆవరణలో.. సుమారు 28 సంవత్సరాల నుండి బస్సు ఓనర్స్ అసోసియేషన్ వారు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోటార్ వాహనాలుకు సంబంధించి దేశమంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులన్నీ తొలగి మోటార్ వాహనాల సంస్థ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కృష్ణ బలిజ చైర్మన్ గంటా త్రిమూర్తులు, బస్సు ఓనర్స్ ముత్యాల బుజ్జి, పినిశెట్టి నాగు, దాసరి సూరిబాబు, విజయ్, కోళ్ల సురేష్, బాబు, మహేష్, శ్యాము, డీకే ఆర్ ప్రసాద్, భూపతి రాజు బుజ్జిరాజు, విజ్జురోతు రాఘవులు, అరిటాకుల రాజా మొదలగు బస్సు ఓనర్స్ బస్టాండ్ ఆవరణంలో ఉన్న వ్యాపారస్తులు భక్తులు పాల్గొన్నారు.