The Desk… Machilipatnam : లా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఉపకులపతి కె.రాంజీ

The Desk… Machilipatnam : లా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఉపకులపతి కె.రాంజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం: కృష్ణా విశ్వవిద్యాలయం: ది డెస్క్ :

కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న లా పరీక్షల కేంద్రాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన లా మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షల కోసం ఫార్మసీ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.

మచిలీపట్నం దైత శ్రీరాములు హిందూ లా కళాశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాజకీయ నాయకులు, విద్యాధికారులు లా పరీక్షలకు హాజరుకావడం గమనార్హం.