The Desk …Thulluru : పారిశుధ్య కార్మికులకు పాదపూజ

The Desk …Thulluru : పారిశుధ్య కార్మికులకు పాదపూజ

🔴 అమరావతి : తుళ్లూరు : ది డెస్క్ :

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పారిశుధ్య కార్మికులకు పాదపూజ చేశారు. రాజధానిలోని రాయపూడి సిఆర్డిఎ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో మంగళ వారం పారిశుధ్య కార్మికుల పాదములను కడిగి శాలువాలు కప్పి సత్కరించారు. పారిశుధ్య కార్మికులకు పాద పూజ చేయడం తనకు సంతృప్తి నిస్తోందని మనోజ్ అన్నారు.

తన కుమార్తె అంబుల వైష్ణవి వైద్య విద్యనభ్య సిస్తోందని, తనకు కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం లేనందున పారిశుధ్య కార్మికులను సత్కరించానని చెప్పారు. అమరావతి ప్రాధాన్యతను చాటాలని, నిర్మాణానికి రూ.116/-లు విరాళం ఇవ్వాలని తన కుమార్తె చేసిన విజ్ఞప్తికి అందరూ సహకరించాలని కోరారు.