🔴 కాకినాడ జిల్లా : కాకినాడ : ది డెస్క్ :
కాకినాడ జిల్లాలో ఉన్న అన్నీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కోర్టు ఫీజు స్టాంపులు అందుబాటులోకి వచ్చాయని కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్టార్ కే. ప్రసాదరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కోర్టు ఫీజు స్టాంపులు అమ్మకాలకు సంబంధించి నెలకొన్న సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కారం అయ్యిందన్నారు.
కొద్దిరోజులుగా కోర్టు ఫీజు స్టాంపులు అమ్మకం ఆన్ లైన్ నమోదులో సమస్యలు తలెత్తిందని, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా… స్టాంపులు ఆన్ లైన్ లో నమోదు సమస్య పరిష్కారమైందని, నేటి నుంచి యధావిధిగా కోర్టు ఫీజు స్టాంపులు అమ్మకం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్టార్ తెలిపారు.
అదేవిధంగా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో స్టాంప్స్ లేవని ప్రచారం జరుగుతుందని అట్టి వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. రిజిస్ట్రేషన్స్ కి సంబంధించిన వెబ్సైట్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని జిల్లాలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అందుబాటులో ఉన్నాయని అవసరమైన వారు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్టాంప్స్ ను కొనుగోలు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రార్ కె. ప్రసాదరావు తెలిపారు.

