The Desk…T. Narasapuram : నాటు సారా స్వాధీనం… మహిళపై కేసు నమోదు

The Desk…T. Narasapuram : నాటు సారా స్వాధీనం… మహిళపై కేసు నమోదు

ఏలూరు జిల్లా : టి.నరసాపురం : ది డెస్క్ :

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఏలూరు వారు శ్రీలత , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు కె.వి.యన్.ప్రభు కుమార్ , డి.పి.ఈ. ఓ ఏలూరు జిల్లా ఆవులయ్య ఆదేశాల ప్రకారం చింతలపూడి స్టేషన్ అధికారులు, సిబ్బంది కలిసి ఎక్సైజ్ దాడులు నిర్వహించగా.. చింతలపూడి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఇంజమూడి వెంకటరమణ అను మహిళ వద్ద నుండి (02) లీటర్ల నాటు సారాయిని స్వాధీన పరుచుకుని మహిళపై కేసు నమోదు చేసారు.

అలాగే చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఇంజముడి వెంకటరమణ అను మహిళను మరియు లింగపాలెం మండలం వెస్ట్ అడవెల్లి గ్రామానికి చెందిన యాడ సాయికుమార్ అను ఇరువురిని మండల తహసీల్దార్ వారి ఎదుట హాజరు పరచగా, మండల మెజిస్ట్రేట్ వారు 129 బి.ఎన్. ఎస్. ఎస్ చట్టం ప్రకారం బైండ్ ఓవర్ విధించారు.
అలాగే చింతలపూడి మండలంలో గల పలు మద్యం దుకాణాలలో తనిఖీలు నిర్వహించినారు

లింగపాలెం మండలం మట్టం గూడెం గ్రామానికి చెందిన తాళం రాంబాబు అను వ్యక్తి వద్ద నుండి కల్లును రసాయన పరీక్షల నిమిత్తం శాంపుల్ గా సేకరించారు
ఈ దాడుల లో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ లు అబ్దుల్ ఖలీల్ , ఎస్ ఐ. జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నట్లు ఎక్సైజ్ సి. ఐ.పి.అశోక్ తెలిపారు.