The Desk …Kaikaluru Rural : అతి వేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం.. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి : రూరల్ సీఐ రవికుమార్

The Desk …Kaikaluru Rural : అతి వేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం.. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి : రూరల్ సీఐ రవికుమార్

ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ : ది డెస్క్ :

రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. జిల్లా ఎస్పీ కొమ్ము ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కైకలూరు రూరల్ పరిధిలో శనివారం ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్, ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి, వాహన యజమానులతో వెంటనే నెంబర్ ప్లేట్‌లు ఏర్పాటు చేయించారు.

అలాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి జరిమానాలు విధించకుండా, అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు.

సందర్భంగా సీఐ వి. రవి కుమార్ మాట్లాడుతూ… వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని ప్రజలకు కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్, ఎస్సై రాంబాబు పిలుపునిచ్చారు.