🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :
“అధికారుల పన్నుబాట ” ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు పన్ను బాట పట్టారు. 100% పనులు వసూలు చేయాలనే లక్ష్యంతో పంచాయతీ అధికారులు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు కార్యలయపు పర్యవేక్షకులు పలువురు పంచాయతీ అధికారులు పన్నుబాట పట్టారు. రోజుకు రెండు మూడు గ్రామాలు పర్యటిస్తూ గ్రామాల్లో ఆస్తి పన్ను- ఇంటి పన్ను వసూల్లో నిమగ్న మయ్యారు. ఒక్కొక్క బకాయి దారు ఇంటికి అవసరమైతే మూడు నాలుగు సార్లు కూడా పర్యటించి పన్నులు వసూలు చేస్తున్నారు.
గురువారం ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు కార్యాలయం పర్యవేక్షకులు అంజిబాబు పలువురు మండలంలోని బాదంపూడి చేబ్రోలు ఉంగుటూరు, నారాయణపురం పలు గ్రామాల్లోని పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, అపార్ట్మెంట్లు పలు ప్రాంతాలను సందర్శించి పన్నులు వసూలు చేయడం జరిగింది . ఈనెల 15వ తేదీ లోపు 90% పైగా పన్ను వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అదేవిధంగా గ్రామస్తులు వివిధ సంస్థల అధినేతలు, గృహస్తులు, వ్యాపారవేత్తలు అదేవిధంగా మండలంలోని చెరువులు పాడుకున్న పాటదారులు పంచాయతీలకు చెల్లించవలసిన పనులను సకాలంలో చెల్లించి పంచాయతీల పరిపాలనకు పంచాయతీల అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ మేరకు ఆయా గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా, మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ కార్యక్రమం లో డ్వాక్రా సి.ఏ లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను కూడా సహకరించమని కోరుచున్నారు.

