🔴 పగో : భీమవరం : ది డెస్క్ :
స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్, స్వర్ణ ఆంధ్రా – స్వచ్ ఆంధ్రా లో భాగంగా..భీమవరం మున్సిపాలిటీలో వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ మరియు వెల్ఫేర్ సెక్రటరీలకు స్థిరమైన ఘన వ్యర్థాలు మరియు వాడిన నీటి నిర్వహణపై ప్రభావవంతమైన అవగాహన కల్పించడం కొరకు సామర్ధ్యం పెంపుదల శిక్షణను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు అవగాహన కల్పించారు.
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నాలెడ్జింగ్ పార్టనర్స్ సహస్ మరియు వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థల సహకారంతో ఎంతో అట్టహాసంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది వార్డ్ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ..
ఫీల్డ్ లెవెల్ శిక్షణ అనంతరం స్వర్ణ ఆంధ్రా స్వచ్ ఆంధ్రా కార్యక్రమాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, కంపోస్టింగ్ విధానము,అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో భీమవరం మున్సిపాలిటీను స్వచ్ ఆంధ్రా మరియు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్ కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ స్వర్ణ ఆంధ్రా స్వచ్ ఆంధ్రా, కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు ముఖ్య అతిథులు మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, MHO సుధాకర్ స్వచ ఆంధ్ర కార్పొరేషన్, PMU నుండి స్టేట్ టీమ్ లీడర్ సుధాకర్ వాష్ ఇన్స్టిట్యూట్ నుండి కెపాసిటీ బిల్డింగ్ కోఆర్డినేటర్ పి.రాము,IEC రోహిత్ , వాలంటీర్స్ మొదలగు వారు. వాష్ ఇన్స్టిట్యూట్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాము, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రెటరీ మొదలగు వారు పాల్గొన్నారు.ఈ ట్రైనింగ్ అనంతరం వార్డ్ సెక్రెటరీస్ కు కమిషనర్ చేతులమీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ చేయుట తో పాటు స్వచ్ఛఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా ప్రతిజ్ఞ చేశారు.

