The Desk…Kaikaluru : మత్తు పదార్థాల వినియోగం పై విద్యార్థులకు అవగాహన

The Desk…Kaikaluru : మత్తు పదార్థాల వినియోగం పై విద్యార్థులకు అవగాహన

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం కైకలూరు పట్టణంలోని SNN ప్రభుత్వ హై స్కూల్లో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట కుమార్, ఈగల్ ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్‌తో పాటు కైకలూరు టౌన్ పోలీసులు, ఏలూరు ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై వాటి దుష్ప్రభావాలను వివరంగా తెలియజేశారు.

డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత దేశ భవిష్యత్తు కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని అధికారులు పిలుపునిచ్చారు.