The Desk …Kaikaluru : ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం… ట్రాఫిక్ నియమాలపై ఎస్ఐ వెంకట కుమార్ సూచనలు

The Desk …Kaikaluru : ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం… ట్రాఫిక్ నియమాలపై ఎస్ఐ వెంకట కుమార్ సూచనలు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు టౌన్‌లో ఆటో డ్రైవర్లకు రహదారి ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం ఈరోజు ఉదయం నిర్వహించారు. టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకట కుమార్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట కుమార్ ఆటో డ్రైవర్లకు పలు ముఖ్య సూచనలు చేశారు :

👉 గతంలో ప్రజలు రిక్షాలు, కాలినడకన ప్రయాణించేవారని, ప్రస్తుతం ఆటోలు ప్రధాన రవాణా సాధనాలుగా మారాయని తెలిపారు.

👉 ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని స్పష్టం చేశారు.

👉 రోడ్డుపై అడ్డంగా నిలిపివేయకుండా నిర్ణీత ప్రదేశాలలోనే ఆటోలను పార్క్ చేయాలని సూచించారు.

👉 ఆటో నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హితవు పలికారు.

👉 ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని పేర్కొన్నారు.

👉 కైకలూరు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువులు ఉండటంతో భారీవాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు.

👉 రాంగ్ రూట్‌లో వాహనాలు నడపరాదని, రహదారి నియమాలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.

👉 ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

“ప్రపంచానికి మీరు ఒక్కరే కాకపోయినా, మీ కుటుంబానికి మీరు పెద్ద దిక్కు. అందుకే రహదారి నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలి” అని ఎస్ఐ వెంకట కుమార్ ఆటో డ్రైవర్లకు సూచించారు.