The Desk … Machilipatnam : అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk … Machilipatnam : అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

అర్హులైన ప్రతీ ఒక్కరికీ అక్రిడిటేషన్ మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ లో వారి అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ జీవో నెం. 84 లోని నిబంధనల ప్రకారం 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామన్నారు. ఇంకా అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఈనెల 24వ తేదీన జరిగే మూడో విడత సమావేశంలో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

అక్రిడిటేషనులు మంజూరు కానీ పాత్రికేయులు వారి అర్హతకు సంబంధించి ఆధార పత్రాలు, అనుబంధ పత్రాలు జతపరచి మరల సమర్పించిన యెడల పరిశీలించి అక్రిడిటేషనులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఉన్న వివిధ జర్నలిస్టు సంఘాల సభ్యులు, మీడియా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.