🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :


రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.రజని ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీషా, దేవదాయశాఖ కమీషనర్ కె.రామచంద్రమోహన్ ఇంద్రకీలాద్రిపై వెంచేసిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి రెవిన్యూ వార్డు-14 (బ్లాక్ 15,16)లో రూ.200 కోట్లకు పైగా విలువైన భూములను గుర్తించారు.

ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌గౌడ్ పిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.‘ఈనాడు’ దినపత్రికలో 21.08.2024 వెలువడిన వార్త ఆధారంగా శ్రీనివాస్‌గౌడ్ 19.09.2024న లోకాయుక్తకు పిర్యాదు చేశారు. విచారణలో రెవిన్యూ, దేవదాయశాఖ అధికారులు సర్వే నంబర్-112లో యేకాల 11.54 సెంట్ల భూమిని దేవస్థానానికి చెందినదిగా నిర్ధారించారు.

గతంలో ఆంధ్ర సిమెంట్ కంపెనీ ఆక్రమించిన ఈ భూములు ఇప్పుడు లోటస్ ల్యాండ్ లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలుగా మారాయి. కలెక్టర్ లక్ష్మీషా 22ఏ(1)(సి) చట్టం ప్రకారం ఎట్టకేలకు చేర్చి, రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయ కమీషనర్ ఈ భూములను స్వాధీనం చేసుకుని దేవస్థానానికి అప్పగించాలని, 224 పేజీల నివేదిక లోకాయుక్తకు సమర్పించారు.

