🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మ వారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరానికి చెందిన గోంట్ల వెంకట రామారావు వెంకట లక్ష్మి సత్యవతి దంపతులు (1,17000) విలువ చేసే 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.

