The Desk…Kaikaluru : ‎AI హీరోలు రాబోతున్నారు : ఎంపీ మహేష్ పుట్టా

The Desk…Kaikaluru : ‎AI హీరోలు రాబోతున్నారు : ఎంపీ మహేష్ పుట్టా

🔴 ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :


ఏఐతో సినిమాలు తీసే రోజులు వస్తాయి.

కృత్రిమ మేధ ప్రపంచ భవిష్యత్తును శాసించబోతోంది

ఏఐ నైపుణ్యాలతో విద్యార్దులకు బంగారు భవిష్యత్తు

విద్యా, ఉపాధి అవకాశాల్లో ఏలూరు విద్యార్దులు ముందుండాలనే లక్ష్యంతోనే AI పాఠాలు.
‎➖MP మహేష్ పుట్టా

హీరోలు, నటులు నటించాల్సిన అవసరం లేకుండా ఏఐ టెక్నాలజీతో ఒరిజినల్ నటుల రూపు రేఖలతోనే క్యారెక్టర్లను తయారుచేసి వాటితోనే సినిమాలు తీసే రోజులు త్వరలోనే వస్తాయన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో AI కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ  ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..

మారుతున్న కాలంతో పాటు విద్యార్దులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలు కల్పించాలనే లక్ష్యంతో AI లాబ్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో  7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.


‎ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా, ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. తాను చదువుకునే సమయంలో కంప్యూటర్ నేర్చుకున్నానని, ఇప్పటి విద్యార్దులు కంప్యూటర్ తో పాటు AI పరిజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జాబ్ స్కిల్స్ లో AI పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోవు రోజుల్లో రోబోలు, ఏఐ ద్వారానే అన్ని పనులు చేసే పరిస్థితి రాబోతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ ల పట్టుదలతో అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపు రేఖలు మారనున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.  టెక్నాలజీ ఉపయోగించుకుని కొత్త  ఆవిష్కరణలు చేసే ప్రతిభ గల విద్యార్దులు ముందుకు వస్తే టాటా ఇన్నోవేషన్ సెంటర్ కి పంపించడం ద్వారా వారి కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్దులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్  తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణ, కమ్మిలి విఠల్ రావు, స్థానిక నేతలు, ORRC స్వచ్ఛంద సంస్థ  ప్రతినిధులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.