The Desk … Denduluru : కల్తీ నెయ్యి పాపం వైసిపిదే…లడ్డూ వ్యవహారంలో వైసీపీ సర్కార్  చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలి➖కొఠారు ఆదిశేషు

The Desk … Denduluru : కల్తీ నెయ్యి పాపం వైసిపిదే…లడ్డూ వ్యవహారంలో వైసీపీ సర్కార్ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలి➖కొఠారు ఆదిశేషు

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు JSP కార్యాలయం : ది డెస్క్ :

రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో గత వైసిపి ప్రభుత్వం చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ కొఠారు ఆదిశేషు డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది.

ఈసందర్భంగా కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన అవకతకులపై కట్టుబడి వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లు కడగడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం తమ తప్పిదాలకు క్షమాపణ చెబితే ఆ కలియుగ దేవుడు క్షమిస్తాడని, ప్రజలు కూడా గతంలో చేసిన తప్పిదాలు కట్టుబడి 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు, దేవుడికి క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

జనసేన వీరమహిళ కొఠారు లక్ష్మి మాట్లాడుతూ..

గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో నెయ్యి వాడకుండానే వివిధ రకాల జంతు అవశేషాలతో కూడిన కెమికల్స్ వాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. సిబిఐ నివేదికను కొందరు వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. చేసిన తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

JSP Leaders Demand YSRCP Apology Over Tirupati Laddu Scandal

Jana Sena Party (JSP) constituency convener Kotaru Adiseshu demanded that the previous YSRCP government apologize for irregularities in the Tirumala Tirupati laddu scandal. Speaking at a press meet at the JSP office in Denduluru, he praised party chief Pawan Kalyan for exposing the misuse of chemicals instead of ghee, even climbing temple steps in devotion. “If YSRCP seeks forgiveness from God and people now, they might be spared; otherwise, zero seats await in future polls,” he warned, recalling voters’ punishment with just 11 seats last time.

JSP Mahila leader Kotaru Lakshmi accused the ex-regime of using animal residues and chemicals, slamming YSRCP leaders for dismissing the CBI report. Several party activists attended.