🔴 అమరావతి : తుళ్లూరు : ది డెస్క్ :

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవికి ఘన సత్కారం
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పాదపూజ చేసిన అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్
తండ్రి, కుమార్తెలను ఘనంగా సన్మానించిన రాజధాని రైతులు


ప్రజా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అన్నదాతలు త్యాగధనులని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కొనియాడారు. గురువారం ఆమె తండ్రి మనోజ్ తో కలిసి రాజధాని గ్రామం అనంతవరం కొండపై వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.


అనంతరం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలకు పాద పూజ చేసి సన్మానించారు. ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైష్ణవి సూచించారు. ఈ సందర్భంగా వైష్ణవి, డాక్టర్ మనోజ్ ను రాజధాని రైతులు ఘనంగా సన్మానించారు.

