The Desk…Mandavalli : రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

The Desk…Mandavalli : రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

ఆపరేషన్ సురక్ష కార్యక్రమంలో భాగంగా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ పర్యవేక్షణలో మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో శుక్రవారం లోకుమూడిలో ఆటో, ట్రాక్టర్, బొలెరో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలన్నారు. అలాగే, అధిక లోడ్‌ తో, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్, బీమా కలిగి ఉండాలన్నారు. వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ల వినియోగం నివారించాలన్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సీఐ రవికుమార్ డ్రైవర్లకు సూచించారు.