ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

విద్యార్థుల భద్రతపై కైకలూరు టౌన్ పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. పాఠశాల, కాలేజీ బస్సుల తనిఖీ లు నిర్వహించినారు. పాఠశాల, కళాశాల విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కైకలూరు పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై వెంకట కుమార్, సిబ్బంది తో కలిసి గురువారం పట్టణంలోని పలు విద్యా సంస్థలకు చెందిన బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల ఫిట్‌నెస్, బ్రేక్ కండిషన్, టైర్ల స్థితిగతులు, అత్యవసర ద్వారాల Emergency Exits పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై వాహన చోదకులకు, యాజమాన్యాలకు పలు కీలక సూచనలు చేశారు.

బాధ్యతాయుత ప్రయాణం “వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయని.. ప్రతి డ్రైవర్ గుర్తించాలన్నారు. బస్సు కండిషన్ సరిగా లేకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ” వేగం వద్దు – ప్రాణం ముద్దు అని.. అతి వేగం ప్రమాదకరం అని, నిర్ణీత వేగ పరిమితి లోనే వాహనాలను నడపాలని హెచ్చరించారు.

అదేవిధంగా డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని.. సరైన వాహన పత్రాలు RC, Insurance, Fitness ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకట కుమార్ హెచ్చరించారు.

