The Desk…Rajavommangi : క్షేత్ర సహాయకునిపై విచారణ

The Desk…Rajavommangi : క్షేత్ర సహాయకునిపై విచారణ

🔴 అల్లూరి జిల్లా : రాజవొమ్మంగి : ది డెస్క్ :

ఉన్నతధికారుల ఆదేశాలు మేరకు అమినాబాద్ ఫీల్డ్ అసిస్టెంట్ దొండ జగదీష్ ను రంపచోడవరం డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విచారించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి సమావేశ మందిరంలో విచారణ నిర్వహించారు.

అమినాబాద్ క్షేత్రసహాయకులు జగదీష్ ఉపాధిహామీ పథకం అమలులో అవినీతి అక్రమాలు చేస్తున్నారని, తప్పుడు మస్తర్లు వేసి ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని పెయ్యాల చిన్ని అనే మహిళా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఉన్నత అధికారులు స్పందించి ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్ ను విచారణ అధికారిగా నియమించారు. సందర్బంగా ఫిర్యాదు మహిళా చిన్న నుంచి వివరాలు సేకరించి సంబంధిత దస్త్రాలను ఏపీడీ పరిశీలించారు.

సందర్భంగా ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ..

సాంకేతిక అంశాలు ముడిపడి ఉండడం వలన విచారణ కొనసాగుతుందని త్వరలో పూర్తి నివేదికను ఉన్నతధికారులకు పంపడం జరుగుతుందని అన్నారు. తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే శాఖపరమైన చర్యలుంటాయని అన్నారు.

ఈ విచారణ సందర్బంగా ఫీల్డ్ అసిస్టెంటుకు అనుకూలంగా, వ్యతిరేకంగా శ్రామికులు, నాయకులు రావడం విశేషం. విచారణ సమయంలో ఏపీడీ రాంబాబు, ఎంపీడీఓ యాదగిరేశ్వరరావు, ఏపీఓలు సురేష్, రాంబాబు, టీడీపీ నాయకులు తాతారావు, పుట్టా బుజ్జి, ఏఎంసి చైర్మన్ లోత లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.