🔴 కోనసీమ జిల్లా : వాడపల్లి : ది డెస్క్ :

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం బహిరంగ మరియు సీల్డ్ టెండర్లను నిర్వహించారు. ఈ టెండర్ల ద్వారా దేవస్థాన ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేసే హక్కునకు, శ్రీనివాస ప్రాంగణంలో రెండు తాత్కాలిక షాపులకు (అప్పగించిన రోజునుండి 3 సంవత్సరాల కాలపరిమితికి) అలాగే లడ్డు బాక్స్‌లు (9x9x9 cms) సరఫరా చేసే హక్కును టెండర్లు నిర్వహించారు.
ఈ టెండర్లు ది.01-02-2026 నుండి ది.31-01-2027 వరకు ఒక సంవత్సర కాలపరిమితికి సంబంధించి నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. టెండర్ల ప్రక్రియను ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షించి నిర్వహించారు. టెండర్ల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, తమ్మన సాయి ప్రసాద్, శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామస్తులు ఏపుగంటి సుబ్బారావు, పైడికొండల వేంకటేశ్వరరావు, ఆలయ సిబ్బంది, పాటదారులు పాల్గొన్నారు.

