The Desk … Eluru : ‎కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం : ఎంపీ పుట్టా మహేష్

The Desk … Eluru : ‎కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం : ఎంపీ పుట్టా మహేష్

రవాణా, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం.

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అధిక నిధులు.

ఏలూరులో నల్లదిబ్బ రోడ్డు, ఎస్సీ మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన.

మూడు నెలల్లోనే హామీ నెరవేర్చిన ఎంపీ.

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

కూటమి ప్రభుత్వంలో రోడ్లు, రైల్వే, డ్రైనేజీ, స్మశానవాటికలు వంటి రవాణా, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం ఉదయం ఏలూరు పట్టణంలోని నల్లదిబ్బ రోడ్డు పనులకు,ఎస్సీ మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు.

గత అక్టోబర్ చివరిలో స్థానిక ప్రజల కోరికమేరకు వన్ టౌన్ 1&2 డివిజన్లో పరిధిలో పర్యటించి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి పట్టణంలో ఆధ్వానంగా మారిన నల్లదిబ్బ- సాయినగర్ రోడ్డును సందర్శించిన ఎంపీ, ఈ రోడ్డును త్వరలోనే బీటీ రోడ్డుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని  హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హమీ ఇచ్చినట్లుగానే మూడు నెలలు తిరగకుండానే, ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు కేటాయించి శనివారం శంకుస్థాపన కూడా చేయటం విశేషం.

సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...

ఏలూరు పార్లమెంటు పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత అక్టోబర్ లో స్థానిక ప్రజలు ఇక్కడ సరైన రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకురాగా, ఎంపీ నిధుల నుంచి కొత్తగా నిర్మించే ఈ నల్లదిబ్బ రోడ్డుకు నిధులు కేటాయించటం జరిగిందన్నారు.

‎అనంతరం ఏలూరు జెబి పార్కు వద్ద 20 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించే ఎస్సీ మల్టీ పర్పస్ హాల్ భవనానికి  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ, దళితుల సంక్షేమానికి, సౌకర్యాలకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అన్ని సౌకర్యాలతో భవనం మంచిగా నిర్మించుకోవాలని, భవన నిర్మాణానికి అవసరమైతే మరో 20 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడారు.