The Desk … Eluru : కార్యకర్తల కష్టం మర్చిపోము➖ఎంపీ పుట్టా

The Desk … Eluru : కార్యకర్తల కష్టం మర్చిపోము➖ఎంపీ పుట్టా

ఏలూరులో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

దేశంలో బీజేపీ తర్వాత అత్యంత పటిష్ట యంత్రాంగం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..

గత ఐదేళ్లలో రాష్ట్రంలో, జిల్లాలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, కస్ట నష్టాలను ఎదుర్కొని పనిచేయబట్టే ఈరోజు తామందరం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పదవుల్లో ఉన్నామని ఎంపీ అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను వారి అవసరాలను గుర్తించడం తమ బాధ్యతగా ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన పెద్దలు గన్ని వీరాంజనేయులు పార్టీని జిల్లాలో సమర్థవంతంగా సమన్వయంతో ముందుకు నడిపించారని కొనియాడారు.

అదే బాటలో ఇప్పుడు జిల్లా పార్టీకి నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డ బడేటి రాధాకృష్ణయ్య పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తారనే నమ్మకాన్ని ఎంపీ వ్యక్తం చేశారు. జిల్లాలో నాయకులందరూ సమన్వయంతో పని చేస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఇదే ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.

ఆద్యంతం కార్యకర్తల ఆనందోత్సాహాలు, నినాదాల మధ్య వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల వరకూ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రోషన్ కుమార్, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, పీతల సుజాత, ఇతర నేతలు పాల్గొన్నారు.