🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన సమస్యలను లోక్ సభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు, ప్రజల నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆహ్వానించారు. విద్యార్థులు, ప్రజల నుంచి వచ్చిన వాటిలో ఉత్తమమైన కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి, వాటిని ప్రజల తరఫున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వచ్చే పార్లమెంట్ మీటింగ్ లో ప్రస్తావిస్తారు. ప్రశ్నలు పంపించే కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు “మీ ఎంపీ పార్లమెంట్లో ఏ ప్రశ్న అడగాలి?” అని పంపే ప్రశ్నల్లో ఎంపికైన వాటిని ఎంపీ పార్లమెంట్లో అడుగుతారు. అంతేకాకుండా, ఎంపికైన ప్రశ్నలు రాసిన వారిని చట్టాలను రూప కల్పన చేసే భారతదేశ అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటికి ఆహ్వానించి, ఒక రోజు విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రశ్నలను నేరుగా 9618194377, 9885519299 నంబర్లకు వాట్సప్ ద్వారా పంపగలరు.

