ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జిల్లా SP K. ప్రతాప్ శివ కిషోర్, DSP శ్రవణ్ కుమార్ తో కలిసి కైకలూరు మండలం ఆటపాక గ్రామములో సంక్రాంతి పండుగ నేపథ్యంలో యువత పెడదారిన పట్టకుండా క్రీడల వైపు మళ్ళే లా కైకలూరు టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్” క్రికెట్ టోర్నమెంటు ముగింపులో భాగంగా టోర్నమెంటులో గెలిచిన జట్టులకు ఆదివారం బహుమతులు అందజేశారు.

ఈ సందర్బంగా కామినేని, SP ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతు.. యువత పెడదోవ పట్టకుండా సంక్రాంతి పండుగకి జూదాలు, పందాలకు ఆకర్షితులు కాకుండా ఇలా సంప్రదాయ క్రీడాలను ప్రోత్సహించటం చాలా ఆనందదాయకం అని అన్నారు. క్రీడల వల్ల మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని.. దీంతో ఆరోగ్యంగా ఉంటారని.. శరీరం ఫిట్ గా ఉండి అనారోగ్య బారిన పడకుండా ఉంటారని అన్నారు.

ఈ సందర్బంగా టౌన్ సీఐ AVS రామకృష్ణ, టౌన్ SI వెంకట్ కుమార్ తెలిపిన వివరాల మేరకు 12 రోజులు నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 79 జట్టులు పాల్గొన్నాయని.. మొదటి స్థానం కైకలూరు పోలీస్ టీం కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో కైకలూరు శివ 11s టీం నిలిచింది. మూడవ స్థానంలో కైకలూరు చిన్న చెరువు గట్టు టీం దక్కించుకుంది. కాగా, అండర్ 19 సిరీస్ లో మొదటి స్థానం జాన్ పేట BJR టీం, రెండవ స్థానంలో వింజరం బాయ్స్ టీం నిలిచాయి అని తెలిపారు.

టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికీ హెల్మెట్ లు బహుమతిగా అందించారు. మూడు హ్యాట్రిక్ సిక్స్ లతో మ్యాన్ అఫ్ ది సిరీస్ గా నిలిచిన కైకలూరు టౌన్ SI వెంకట్ కుమార్ని కప్, షీల్డ్ ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఏలూరు రేంజ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, నియోజకవర్గ టిడిపి కన్వినర్ వీరమల్లు నరసింహారావు, యునైటెడ్ స్టార్ ఇన్సూరెన్స్ వారు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

