🔴 ప్రకాశం జిల్లా : ఒంగోలు : ది డెస్క్ :
ఒంగోలు లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి ఆనం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మూడు దశాబ్దాల క్రితం తాను కాలం చేసిన ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగువారి ఆరాధ్య నాయకుడు, మహా పురుషుడు, మహా నటుడు, నాయకుడు, ప్రజా సేవకుడు, ప్రజల కోసం తపించి, ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన పుణ్య పురుషుడు నందమూరి తారక రామారావు. నేడు ఆ మహానుభావుడు విగ్రహవిష్కరణలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.
ఈ గొప్ప కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దామరచర్ల జనార్ధన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి సహచర మంత్రి బాలస్వామితో కలిసి నేడు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సూక్తితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కి నివాళులర్పించడం మహత్తర భాగ్యంగా భావిస్తున్నాను.
ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు విషయంపై మాట్లాడుతూ :
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నాయకులు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పై వివరణ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత లేదు.
ప్రపంచంలో ఉన్న తెలుగు వారు తలా ఒక రూపాయి ఇచ్చిన వేల కోట్ల రూపాయలు సమకూర్చి వేల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కొన్ని శక్తులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గొప్ప నాయకుడు అయినటువంటి నందమూరి తారకరామారావు లాంటి వ్యక్తుల పైన బురద చల్లడం అనేది సభ్యత,సంస్కారం లేని కొన్ని రాజకీయాలు పార్టీలు చేయడం దారుణం… వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్న.

