🔴 తూగో : రాజమహేంద్రవరo : ది డెస్క్ :
సంక్రాంతి ప్రయాణాల్లో ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై ఉక్కుపాదం – కఠిన చర్యలు..!!
RTC ఛార్జీలకు మించి వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు..!!
ప్రయాణికుల రక్షణే లక్ష్యం – అధిక ఛార్జీలపై ఫేర్ మానిటరింగ్ టీమ్‌లతో నిరంతర నిఘా
➖R సురేష్ (జిల్లా రవాణా శాఖ అధికారి)
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టిందని తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్. సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత ఐదు రోజులుగా RTGS పర్యవేక్షణ వ్యవస్థతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Fare Monitoring Teams ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్ములు (అభిబస్, రెడ్‌బస్ తదితర యాప్‌లు)లో ప్రైవేట్ బస్సుల ఛార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రైవేట్ బస్సు యజమానులతో అధికారులు సమన్వయం చేసి, ఛార్జీలను తక్షణమే తగ్గించి నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. RTC నిర్దేశించిన ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని, దానికంటే ఎక్కువ ధరలకు టికెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 24×7 హెల్ప్‌లైన్ నెంబర్ – 92816 07001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సు ఛార్జీలు, టికెట్ ధరలు లేదా ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం అందిస్తారని చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రతి ప్రైవేట్ బస్సులో తప్పనిసరిగా స్పష్టంగా ప్రదర్శించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా మోటార్ వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నట్లు వెల్లడించారు.
గత ఐదు రోజులుగా నిర్వహించిన ఈ తనిఖీలలో అధిక ఛార్జీలు వసూలు చేసిన 13 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,30,000/- జరిమానా విధించామని, అలాగే పన్ను, పర్మిట్ తదితర నిబంధనలు ఉల్లంఘించిన 18 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.64,300/- జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీలు మరియు పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతుందని, పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని ఆర్ సురేష్ స్పష్టం చేశారు.
ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు భద్రతతో కూడిన ప్రయాణం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పండుగ కాలంలో ప్రయాణికుల శ్రేయస్సు కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Strict Action Against Private Buses Overcharging During Sankranti.
Fare Monitoring Teams on High Alert to Protect Commuters; Legal Action for Violations.
RTC Rates + Max 50% Excess Allowed; 24×7 Helpline Launched ➖R Suresh (District Transport Officer).
In a bid to curb overcharging by private buses amid the Sankranti rush, Andhra Pradesh Transport Department has launched stringent measures, East Godavari District Transport Officer R. Suresh announced on Tuesday.
With a surge in passengers heading to native villages, officials are monitoring fares through the RTGS system and special Fare Monitoring Teams. These teams are scrutinizing online booking platforms like AbhiBus and RedBus round-the-clock for the past five days, Suresh said in a statement.
“Upon detecting excess fares, we immediately coordinate with bus operators to slash rates on the spot,” he added. “Operators can charge only up to 50% above RTC-prescribed fares—anything more invites legal action.
“Prioritizing commuter welfare, a statewide 24×7 helpline—92816 07001—has been activated. “Complaints on fares, tickets, or other issues will trigger instant response and resolution,” Suresh assured, adding that bus owners must prominently display the number.
Motor Vehicle Inspection teams are conducting extensive field checks. Over the last five days, cases were registered against 13 buses for overcharging (₹1.3 lakh fines) and 18 for tax/permit violations (₹64,300 fines)
These special inspections and surveillance will continue until January 18, extending to return journeys post-festival. “The AP government’s top priority is safe, comfortable, and secure travel for all,” Suresh emphasized.

