రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రికి సామాజిక కార్యకర్త జంపాన విజ్ఞప్తి
🔴 కృష్ణాజిల్లా : పమిడిముక్కల మండలం : ది డెస్క్ :

గురజాడ రెవిన్యూ గ్రామంలో ఖాతా నెం.772, సర్వే నెం. 162/1లో, య.0-42 సెంట్ల వ్యవసాయ భూమి, సర్వే నెం.162/1లో వెబ్ ల్యాండ్ నందు ముగ్గురు రైతులు నమోదైయున్నందున..భూమి సబ్ డివిజన్ చేసి, సర్వే నెంబరు కేటాయించమని 16.12.2024న గురజాడ గ్రామ రెవిన్యూ సదస్సులో, ఉయ్యూరు ఆర్డివోకి సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఇచ్చారు.
రెవిన్యూ అధికారుల ఆదేశం మేరకు ది.03.03.2025న 550/- మీ సేవ ద్వారా (చలానా)జంపాన చెల్లించారు. పమిడిముక్కల మండల సర్వేయర్ జంపాన వ్యవసాయ భూమిని సబ్ డివిజన్ నిమిత్తం 2025 మేనెలలో సర్వే చేశారు. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ భూమి సబ్ డివిజన్ కాలేదు. ఈ సందర్భంగా జంపానకు సంబంధించిన వ్యవసాయభూమి సబ్ డివిజన్ నిమిత్తం కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె బాలాజీ తగు చర్యలు తీసుకోనటానికి రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు.

