ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ :
కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా నిరంతరం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ద్వారకా తిరుమలలోని కృష్ణుని గుడి వద్ద ఉన్న మల్టీ పర్పస్ భవనంలో అదనపు వసతి గదుల నిర్మాణం, ఆధునీకరణ పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఏలూరు ఎంపీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
సమాజంలో అన్ని కులాలు ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి లక్ష్యాలు సాధించుకోగలమన్నారు. అన్ని శుభకార్యాలకు, వేడుకలకు ఉపయోగపడే విధంగా ఈ మల్టీ పర్పస్ భవనాన్ని ఆధునీకరించడంతో పాటు పేదలకు అందుబాటులో ఉండేవిధంగా నిర్వహణ చేపట్టాలని కోరారు. భవనంలో అదనపు వసతి గదుల నిర్మాణానికి 49 లక్షల నిధులు ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో మంచి అనుబంధం ఉందన్న ఎంపీ, ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ..
ద్వారకాతిరుమలలో అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్న ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
జడ్పీ ఛైర్మన్ పద్మశ్రీ మాట్లాడుతూ..
పుట్టా మహేష్ కుమార్ వంటి బీసీ నేత, యువకుడు ఏలూరు పార్లమెంటుకు ఎంపీగా రావటం అదృష్టం అన్నారు.

