The Desk…Bhimadole : ‎కూటమి ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి : ఎంపీ మహేష్

The Desk…Bhimadole : ‎కూటమి ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి : ఎంపీ మహేష్

భీమడోలులో “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం

గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.

ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ.

పలు రోడ్లకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన.

ఒకే ప్రభుత్వం 20- 30 ఏళ్ళు ఉంటే గుజరాత్ తరహా అభివృద్ధి జరుగుతుందన్న ఎంపీ.

ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : ది డెస్క్ :

గ్రామాలలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.
‎ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో రూరల్ లో శనివారం సాయంత్రం “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమంలో అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..

గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకులంతా నిరంతరం పనిచేస్తున్నామన్నారు.
‎ప్రజలు తమను ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఒకే ప్రభుత్వం 20 నుంచి 30 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది పల్లెలు, పట్టణాలు అన్నీ బాగుపడతాయన్నారు. ఇందుకు గుజరాత్ రాష్ట్రమే  ఉదాహరణ అన్న ఎంపీ, గత ప్రభుత్వం వలె కాకుండా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకు వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని 30 ఏళ్ళు గెలిపిస్తే రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఉంగుటూరు నియోజకవర్గానికి, ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడారు. “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమంలో గ్రామస్థుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎంపీ, గ్రామస్థులు అడిగిన రోడ్లకు అనుమతులు మంజూరు చేస్తూ అక్కడికక్కడే ప్రకటన చేయడంతో ప్రజలు సంతోషంతో కరతాళధ్వనులు చేశారు. భీమడోలు గ్రామానికి వచ్చిన ఎంపీకి గ్రామంలో ఘనస్వాగతం లభించింది.

గ్రామస్థుల కోరికమేరకు స్థానిక జూనియర్ కళాశాల అవరణలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కొద్దిసేపు పాల్గొన్న ఎంపీ కళాశాల విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. తనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన విద్యార్థినులతో ఓపికగా సెల్ఫీలు దిగారు. “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం ముగిసిన అనంతరం, ఇటీవల ఇంటివద్ద నడుస్తూ కిందపడి గాయపడ్డ భీమడోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దిరాజుని పరామర్శించారు.