The Desk …Gollapudi : పల్లెల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి.. మైలవరం నియోజకవర్గంలో రూ.6కోట్లతో పల్లెపండుగ 2.0 : మైలవరం ఎమ్మెల్యే వసంత

The Desk …Gollapudi : పల్లెల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి.. మైలవరం నియోజకవర్గంలో రూ.6కోట్లతో పల్లెపండుగ 2.0 : మైలవరం ఎమ్మెల్యే వసంత

గొల్లపూడిలో రూ.1.35 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన.

ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి : ది డెస్క్ :

పల్లెపండుగ 2.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో రూ.1.35 కోట్ల అంచనా వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. పల్లెపండుగతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతకు పల్లెపండుగ నిదర్శనమన్నారు. మరో వైపు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందన్నారు.

పల్లెపండుగతో కొన్ని గ్రామాల్లో నూటికి నూరుశాతం సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దార్శనికులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్టాన్ని ప్రగతి పథంలో పయనింప చేస్తున్నారని అన్నారు.

మైలవరం నియోజకవర్గంలో రూ.6కోట్లతో పల్లెపండుగ 2.0 కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఇబ్రహీంపట్నం మండలానికి రూ.70 లక్షలు, జి.కొండూరు మండలానికి రూ.70 లక్షలు, మైలవరం మండలానికి రూ.1.50 కోట్లు, విజయవాడ రూరల్ మండలానికి రూ.1.85 కోట్లు, రెడ్డిగూడెం మండలానికి రూ.1.20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

మైలవరం నియోజకవర్గంలో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ.9.35 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గొల్లపూడి గ్రామ అభివృద్ధికి రూ.2.30 కోట్లు మండల నిధుల నుంచి మంజూరు చేసినట్లు వెల్లడించారు. గొల్లపూడి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రూ.15 కోట్ల డి.ఎం.ఎఫ్ నిధులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అనంతరం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.