🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా…భీమడోలులోని ZPP హైస్కూల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు భద్రత విషయంపై ప్రతిజ్ఞ చేయించిన రవాణా శాఖ అధికారులు.
రోడ్ భద్రతా ప్రతిజ్ఞ :
XXXXXXX అనే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
▪️రోడ్డుపై వాహనం నడిపే ముందు నేను అన్ని భద్రతా సంబంధిత విషయాలపై శ్రద్ధ చూపుతాను.
▪️ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటిస్తాను.
▪️ నాకు సంబంధించిన మరియు ఇతర రోడ్ వినియోగదారుల భద్రత గురించి చురుకుగా ఉంటాను.
▪️ రోడ్ భద్రత కోసం నిరంతరం పనిచేసి, ప్రోత్సహించి ఇతరులకు అవగాహన కల్పిస్తాను.
▪️రోడ్డు ప్రమాదాల బాధితులకు సహాయం చేయడంలో నేను ఎల్లప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాను.
▪️స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు భద్రమైన రోడ్ల సంస్కృతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళతానని ప్రమాణం చేయుచున్నాను – జైహింద్అంటూ విద్యార్థులచే ప్రమాణం ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో రమేష్ బాబు జగదీష్, కళ్యాణి ప్రజ్ఞ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

