The Desk… Eluru : ‎ఏఐ నైపుణ్యాలతో విద్యార్దులకు బంగారు భవిష్యత్తు : ఎంపీ పుట్టా మహేష్

The Desk… Eluru : ‎ఏఐ నైపుణ్యాలతో విద్యార్దులకు బంగారు భవిష్యత్తు : ఎంపీ పుట్టా మహేష్

కృత్రిమ మేధ ప్రపంచ భవిష్యత్తును శాసించబోతోంది.. ఎంపీ

ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్ళలో ఉచితంగా AI పాఠాలు.

మొదటి విడతలో ఏలూరు ప్రభుత్వ కళాశాలలో ఏఐ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ.

AI ఒక సబ్జెక్టుగా బోధన అవసరమన్న ఎంపీ.

జిల్లా గ్రంథాలయాన్ని డిజిటల్ చేసి అభివృద్ధి చేస్తాం

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేయడంతోపాటు విద్యార్ధులలో నైపుణ్యాల మెరుగుదలకు AI లాబ్స్ ఏర్పాటుపై దృష్టిపెట్టమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో AI కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ గురువారం ప్రారంభించారు.

సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ…

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలు కల్పించాలనే లక్ష్యంతో AI లాబ్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టామని, మొదటి విడతగా ఏలూరు ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలో AI ల్యాబ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా, ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి దశలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ల వల్ల కళాశాల/పాఠశాలల్లో చదువుతున్న సుమారు 3000 మంది విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ సంబంధిత నైపుణ్యం నేర్చుకుని, తద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.

అంతే కాకుండా అదే కళాశాల/ పాఠశాలలో చదివి, ఏఐ పట్ల ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఏఐ  నైపుణ్యాన్ని నేర్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. తాను చదువుకునే సమయంలో కంప్యూటర్ నేర్చుకున్నానని, ఇప్పటి విద్యార్దులు కంప్యూటర్ తో పాటు AI పరిజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందన్నారు.

ఇదే సందర్భంలో, తన విజ్ఞప్తి మేరకు సీఎస్ఆర్ కింద రెండున్నర కోట్ల విలువైన ఏఐ కంప్యూటర్ ల్యాబు పరికరాలు అందించిన ఓఎన్జీసీ సంస్థకు, తన ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంతో ఉపకరించే ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా పనిచేస్తున్న ORRC స్వచ్ఛంద సంస్థకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్దులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత ఇబ్బందులను పలువురు విద్యార్దులు, ప్రధాన ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పెంపునకు మంత్రి నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారని, త్వరలోనే ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరులోని ప్రధాన గ్రంథాలయాన్ని డిజిటల్ చేసి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు.

కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు జనసేన ఇన్ చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ORRC స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఎంపి :

‎‎ఏలూరు పార్లమెంటు పరిధిలో క్రైస్తవ సోదరులకు, పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. ఏలూరు పట్టణంలో గురువారం జరిగిన పాస్టర్ల సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ…

కుల మతాలకు అతీతంగా తనను గెలిపించిన ప్రజలకు, తన కోసం ప్రార్థనలు చేసిన పాస్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు శ్మశాన వాటికల కొరత ఉందని కొందరు  పాస్టర్లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్రైస్తవ శ్మశాన వాటికల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని, ఈ ఏడాది చివరినాటికి భూములు గుర్తించి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.

పాస్టర్ కొడాలి విజయ్ కుమార్ మాట్లాడుతూ..

ఏది కావాలని అడిగినా ఇచ్చే ఎంపీ దొరకటం ఏలూరు ప్రజల అదృష్టమన్నారు. జిల్లాలోని పాస్టర్లనందరినీ కలిపి మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *