ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని రాచపట్నం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బోడావుల ఎలీషా, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను బుధవారం
ఆంధ్రప్రదేశ్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. పండగ వేళ యువత జూదాలకు దూరంగా ఉండేలా ఈ సాంప్రదాయ క్రీడలను నిర్వహించటం అభినందనీయమన్నారు.

ఇటీవల ఆటపాక గ్రామములో కైకలూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను, ఇప్పుడు రాచపట్నం గ్రామములో వాలీబాల్ టోర్నమెంట్ లు జరగటం చాలా ఆనందదాయాకనన్నారు. నియోజకవర్గంలో ప్రతి చోట ఇలానే సాంప్రదాయ క్రీడాలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, టోర్నమెంట్ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

