🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
105 రోజులకు కాలానికి హుండీల ద్వారా మొత్తం ఆదాయం రూ.1,02,81,455 (అక్షరాలా కోటి రెండు లక్షల ఎనభై ఒక వేయి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు)
బంగారం : 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, వెండి : 360 గ్రాములు, నగదు : రూ.1,02,81,455, పలు విదేశీ కరెన్సీ ఆదాయం హుండీల ద్వారా వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ హరి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిపిన ఈ లెక్కింపు కార్యక్రమంలో.. ఆలయ ప్రధానర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖిదారు వెంకటేశ్వరరావు, శక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ దండు కృష్ణం రాజు, భీమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ తోట శ్రీనివాస్, చిక్కాల దేవస్థానం ఈఓ కడలి సాగర్, యూనియన్ బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

