The Desk…Amaravati : ఇది వార్త కాదు…. దేవుడి ముందు నిలబడి, ‘మా ఆలయాలను కాపాడండి’ అని ఒక భక్తుడు కన్నీళ్లతో చేసిన ప్రార్థన.

The Desk…Amaravati : ఇది వార్త కాదు…. దేవుడి ముందు నిలబడి, ‘మా ఆలయాలను కాపాడండి’ అని ఒక భక్తుడు కన్నీళ్లతో చేసిన ప్రార్థన.

▪️సోషల్ మీడియా పేరుతో ఆలయ పవిత్రతపై దాడులు సమంజసమా?

▪️భక్తులు భావాలను దెబ్బతీస్తున్న కొందరు యూట్యూబర్ల తీరు దేనికి సంకేతం?

▪️ఆలయ పవిత్రతను భంగం కలిగించేలా చేస్తున్న కొందరు ఆకతాయిల తీరుపై రాజకీయ ప్రేరణలు, విద్రోహశక్తులు ఉన్నాయా అనే అంశంపై విచారణ జరపాలన డిమాండ్ కూడా వినిపిస్తుందా?

▪️వ్యూస్ కోసం విశ్వాసాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం?

▪️సోషల్ మీడియా శబ్దంలో మునిగిపోతున్న “భక్తి స్వరం ” అసత్య ప్రచారాల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి?

▪️ఆలయాలు లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు కూటమి ప్రభుత్వం పై రుద్దే ప్రయత్నం ఇంకేంతకాలం?

▪️ఆలయాలపై వైరల్ అవుతున్న వీడియోల వెనుక అసాంఘిక శక్తుల కుట్ర లో ఆలయాల టార్గెట్ అవుతున్నాయా? లేదా భక్తి పరీక్షకు గురి అవుతుందా?

▪️ఆలయాల్లో పనిచేయడం అంటే దేవుడు సేవ మాత్రమే కాదు సోషల్ మీడియా తీర్పులను కూడా రోజు ఎదుర్కోవాల్సిన కఠిన పరీక్షగా మారిపోయిందా?

▪️ఆలయాల పవిత్రతను దెబ్బతీసే విధంగా వస్తున్న వీడియోల వెనుక పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు?

▪️ఒకప్పుడు దేవాలయ సేవ అంటేనే గర్వంగా భావించిన సిబ్బంది నేడు ప్రతిరోజు అపనమ్మకాల నీడలో పనిచేయాల్సిన దుస్థితి దేనికి నిదర్శనం?

▪️సామాన్య భక్తులకు దేవుళ్ళని దూరం చేసి…భక్తుల హృదయాల్లో భయబ్రాంతులు సృష్టించి నిజాన్ని వక్రీకరించి, అబద్దాలని అద్భుతం గా వీడియోల రూపం లో చూపే ప్రయత్నాలు జరుగుతూన్నాయా….?

అమరావతి : జనవరి 02 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తూ, దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దేవాలయాలలో కనీస సౌకర్యాలు కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం లో నిర్లక్ష్యం చేసిన అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు గాను కట్టుదిట్టంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి పనుల పురోగతికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ప్రజలను నమ్మకాలకు, విశ్వాసాలను ఎంతో ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో అనేక ఆలయాల అభివృద్ధికి సిజిఎఫ్ నిధులతో ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రంలో నైవేద్యాలకు కూడా నోచుకోని ఎన్నో దేవాలయాలు ధూప దీపం నైవేద్యం పేరుతో దాదాపు 5 వేల ఆలయాలకు నెలకు పదివేల రూపాయలు ఇస్తూ ఆలయాలలో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా శ్రీకారం చుట్టారు. వీటికి తోడు ఆలయాలలో పారిశుద్ధ్య పనులు, శానిటైజేషన్, భక్తుల రద్దీ నియంత్రణ, విఐపి దర్శనాల సమన్వయం, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఇవన్నీ ఏకకాలంలో నిర్వహిస్తూ ఎక్కడా కూడా చిన్న తప్పు జరగకుండా అప్రమత్తంగా పనిచేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖ పనితీరులో నాణ్యత పెరిగింది అన్నది జగమెరిగిన సత్యం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు సిబ్బంది కూడ మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ ప్రతిష్టతను కాపాడుతున్నారు.

గత వైసిపి హాయంలో ఆలయాల పరిస్థితి ఒక చేదు నిజం.. వైసిపి ప్రభుత్వం కాలంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, రధాలు తగలబెట్టడం, పవిత్రమైన లడ్డు లో కల్తీ నెయ్యి, హిందూ సాంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం..ఇలా ఒకటి కాదు అనేక వందల సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను అవకాశం ఉన్న మేర కొల్లగొట్టారు. ఈ ఘటనలు ఇంకా సామాన్య ప్రజల జ్ఞాపకాలలో తాజాగా ఉన్నాయి.ఇప్పటికి వైసీపీ వారు మాట్లాడే మాటలకి, ఇచ్చే ” రప్పా రప్పా స్లోగన్ లకు ” బ్రాంతులకు గురి అవుతూనే ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హయాంలో ఆలయాలలో జరిగిన తప్పులను, శాఖ లో జరిగిన అవినీతి నీ ఇప్పటి ప్రభుత్వం పై ఆపాదిస్తూ….. పబ్బం గడపడం వైసీపీ నాయకులకు పరిపాటి గా మారింది. వైసీపీ నాయకులు ఇప్పటికి ఆలయాలు విషయం లో బురద జల్లాడం, వాటిని కడుకోవడం కూటమి పాలకులకు దేవాదాయ శాఖ అధికారులకు పెద్ద పనిగా మారిపోయింది. అటు సామాన్య భక్తులకు దర్శనాలు విషయం లో చొరవ తీసుకోవాలా…! వైసీపీ రాజకీయ క్రీడాలో బలి అవ్వాలా! అర్ధం కాకా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ సిబ్బంది కి….. కూటమి ప్రభుత్వంలో ఆలయాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సంతృప్తి కరువైన సేవలు జీర్ణించుకోలేని కొందరు యూట్యూబర్లు , ఇన్ఫ్లుయెన్సర్లు ఆలయాల పవిత్రతను భంగం కలిగించేలా చేస్తున్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతుంది. కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవాలపై నిరాధార ఆరోపణలు చేస్తూ సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. లడ్డు ప్రసాదంలో మేకంటూ ఒకరు…..లడ్డు ప్రసాదంలో బొద్దింకా అంటూ ఒకరు, పులిహోరలో వెంట్రుకలు పడ్డాయి అంటూ మరొకరు ఇలా వరుస వీడియోలు విడుదల చేస్తూ ఆలయ ప్రతిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నిజమైన భక్తుల ఆవేదన. సోషల్ మీడియా పేరుతో ఆలయాల పవిత్రతపై దాడులు దేనికి సమంజసం? భక్తి భావాలను కించపరిచే అసత్య ప్రచారల వెనక ఉన్న శక్తులు ఎవరు? అనేక నిరాధార ఆరోపణల వెనుక ఉన్న అస్త్రం ఏమిటి?

కోట్లాదిమందిని భక్తి భావాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూడలేకే… ఇలా వ్యూస్ కోసం విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ మండిపడుతున్నారు నిజమైన భక్తులు. ఆలయము అనేది ఒక కంటెంట్ కాదు , భక్తి అనేది ఒక ట్రెండ్ కాదు, విశ్వాసం అనేది వ్యాపారం కాదు, ఆలయల సేవలో నిమగ్నమైన సిబ్బందిపై అన్యాయ ఆరోపణలు వేకువజాము నుండి అర్ధరాత్రి వరకు ఆలయ సేవలు నిమగ్నమవుతున్న దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అంకితభావాన్ని ఈ ఆరోపణలు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ పరిశుభ్రత, ఆలయం లో శానిటైజేషన్, భక్తుల రద్దీ నియంత్రణ, విఐపి దర్శనాలు, సామాన్య భక్తుల సౌకర్యాలు అన్నిటిని సమన్వయం చేస్తూ పనిచేస్తున్న సిబ్బందిపై ఒక్క ఫేక్ వీడియోతో తీర్పు చెప్పడం సరికాదు! నేడు నిజమైన భక్తులు కోరుకుంటుంది ఆలయ పవిత్రతను కాపాడాలని, అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని.. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని….ప్రభుత్వం ఎప్పుడు ఉక్కు పాదం మోపుతుందో చూడాలి…..సోషల్ మీడియా ముసుగు శబ్దంలో మునిగిపోతున్న భక్తి స్వరం సమాజానికి ఏమి సంకేతం ఇస్తుంది. అసత్య ప్రచార వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేది మిలియన్ డాలర్ ల ప్రశ్న గా మిగులుతుంది…! సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనం కానీ అదే సాధన బాధ్యత లేకుండా ఉపయోగించబడితే అది సమాజంలో అపనమ్మకాన్ని, ఉద్రిక్తతను, విభజనను సృష్టించే ఆయుధంగా మారుతుంది. ఆలయం అనేది కెమెరాకు పనికొచ్చే కంటెంట్ కాదు అది కోట్లాదిమంది హృదయాలలో నిలిచిన విశ్వాసం ఒక చిన్న అసహనాన్ని ఒక క్షణిక అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం వ్యవస్థనే అపఖ్యాతి పాలు చేయడం న్యాయమా? వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆలయ సేవలో నిమగ్నం అవుతున్న దేవాదాయ సిబ్బంది అంకితభావాన్ని ఈ అసత్య వీడియోలు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ! ఆలయాలలో పనిచేయాలంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు…! ఆలయాలలో పనిచేయాలంటే ఉద్యోగ అర్హత మాత్రమే సరిపోవడం లేదు అపనమ్మకాలను, ఆపనిందలు, అసత్యప్రచారాలు భరించే ధైర్యం కూడా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భగవంతుని సేవ అనేది ఒక వరం అనుకున్న రోజు నుండి నేడు అపనమ్మకాల మధ్య నిలబడే పరీక్షగా మారింది…ఇదే దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అనుభవిస్తున్న వేదన.

దేవాదాయ శాఖ మంత్రి గా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖకు స్పష్టమైన దిశ వచ్చింది. అధికారులకు మార్గదర్శకాలు, సిబ్బందికి బాధ్యతలు, భక్తులకు మెరుగైన సేవలు..ఈ మూడు అంశాలపై సమన్వయంతో ముందుకు వెళుతుంది దేవాదాయ శాఖ లో వచ్చిన మార్పులను స్వాగతించవలసిన సమయంలో…వాటిని మసక బార్చే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్న సహజంగానే తలుత్తుతుంది..!

నేడు ఆలయాలు నిర్వహణలో క్రమశిక్షణ, పరిశుభ్రత,భక్తుల సౌకర్యాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా! అన్న సందేహం తలెత్తుతుంది. వ్యూస్ కోసం విలువలు త్యాగమా….? సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏ హద్దులైన దాటాల కంటెంట్ కోసం కోట్లాదిమంది విశ్వాసాలతో చెలగాటం ఆడటం సమంజసంమా? ఆలయం అనేది ఒక ప్రదేశం మాత్రమే కాదు అది ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక ఆత్మీయ అనుబంధం.. ఈ వాస్తవాన్ని విస్మరించే ప్రయత్నాలు సమాజానికి ముమ్మాటికి ప్రమాదకరం.. సోషల్ మీడియా వేదికలు స్వేచ్ఛకు ప్రతీకలే అయిన…..ఆ స్వేచ్ఛకు బాధ్యత కూడా జత కావాలి. అసత్య ప్రచారాలు,అపోహలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే కంటెంట్ చేసే వారిపై, చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఆలయాల పవిత్రతను కాపాడడంలో దేవాదాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలను సమాజం కూడా అండగా నిలవాలి

చివరగా….

భక్తి భావాలు అనేవి రాజకీయాలకు అతీతం…. ఆలయాలు తప్పుడు ప్రచార యుద్ధాలకు వేదిక కావు. నిజాలను దాచిపెట్టి అసత్యాలను వైరల్ చేస్తే ప్రయత్నాలను సమాజం గట్టిగా తిరస్కరించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాదాయ శాఖలో చోటుచేసుకున్న సానుకూల మార్పులను గుర్తించి వాటిని బలోపేతం చేయడమే ప్రజల బాధ్యత..వ్యూస్ తాత్కాలికం….విశ్వాసం శాశ్వతం ఆ విశ్వాసంతో చెలగాటం ఆడే వారిని చరిత్రలో స్థానం ఉండదు…

“ఇది ఎలాంటి రాజకీయ ప్రకటన…..కాదు… ఎవరి మీద ఆరోపణ కాదు… ఇది ఒక సగటు భక్తుడి హృదయ స్వరం.

దేవుడిని చూడటానికి ఆలయానికి వచ్చిన మనల్ని, దేవుడిపై భయం కలిగేలా చేసే ఈ శబ్దాలే బాధ.

ఆలయం ఒక కంటెంట్ కాదు…
భక్తి ఒక ట్రెండ్ కాదు…
విశ్వాసం వ్యాపారం కాదు.
వ్యూస్ కోసం నశించేది వీడియో కాదు…. కోట్ల మంది హృదయాల్లో నిలిచిన నమ్మకం….
ఈ మాటలు వార్త కాదని గుర్తించండి…

ఇది దేవుడి ముందు నిలబడి,‘మా ఆలయాలను కాపాడండి’ అని ఒక భక్తుడు కన్నీళ్లతో చేసిన ప్రార్థన.”

🔴 Amaravati : THE DESK :

Devotees across Andhra Pradesh are raising alarms over viral social media videos that allegedly tarnish temple sanctity, demanding probes into motives ranging from political agendas to sensationalism for views. As the Nara Chandrababu Naidu-led NDA government pushes temple development, accusations of fake claims—like insects in prasadam or hair in pulihora—have sparked outrage, with calls for legal action against creators. The controversy intensified amid the coalition government’s post-2024 reforms in the Endowments Department. Under Minister Anam Ramanarayana Reddy, the department has released hundreds of crores from Chief Minister’s Relief Funds (CMRF) for temple upgrades, completed neglected projects from the previous YSRCP regime, and allocated Rs 10,000 monthly to nearly 5,000 temples for dhupa-deepa-naivedya. Enhanced cleanliness, crowd control, VIP darshan coordination, and facilities for common devotees have been prioritized, officials say. “Since Minister Anam took charge, the department’s efficiency has visibly improved,” said a senior Endowments official in Vijayawada, speaking anonymously. “Staff work round-the-clock—from early morning to midnight—ensuring no lapses. These viral videos undermine their dedication.

“Yet, a flurry of YouTube clips has gone viral, showing alleged impurities: one claims a cockroach in laddu prasadam, another a bottle gourd seed, and a third hair strands in pulihora. Critics, including temple staff and devotees, label them baseless, accusing influencers of prioritizing views over facts.

*Devotees’ Anguish Echoes in Temples.* At prominent shrines like those in Eluru, Bhimavaram, Kakinada, and Konaseema districts—areas of intense local reporting—devotees express frustration. “This isn’t news; it’s a prayer before God: ‘Protect our temples,'” said one anonymous bhaktudu from Eluru, tears in eyes, echoing sentiments in viral posts. “Temples aren’t content farms. Bhakti isn’t a trend, faith isn’t business. “Priests and staff report morale dips. “Serving God once felt like pride; now it’s a daily trial of facing social media judgments,” a temple employee in Kakinada shared. “We handle sanitation, crowds, VIPs—all seamlessly. One fake video judges the entire system.

“Social media’s role amplifies concerns. Questions swirl: Are these attacks on temple purity justified under “social media freedom”? Do they signal deeper political motivations or anti-social forces targeting Hindu sentiments? Demands grow for investigations into “sponsors” behind false propagandas, especially as YSRCP leaders are accused of deflecting past scandals—like idol vandalism, laddu adulteration with inferior ghee, and rathams being damaged—onto the current regime.

*Past YSRCP Tenure : Lingering Shadows.* The YSRCP government’s 2019-2024 term remains a sore point. Reports of hundreds of incidents—temple attacks, iconoclasm, prasadam contamination, and neglect of Hindu traditions—still haunt public memory. “Ordinary people haven’t forgotten,” said a community leader in Konaseema. YSRCP’s “rapid rapid” slogans now face backlash, with opposition alleging they exploit temple issues for political mileage. Endowments officials lament the burden: “YSRCP mudslinging forces us to defend daily. Should devotees suffer their games?” one asked. Viral videos, they claim, ignore NDA’s progress—like better naivedya quality and devotee amenities—fueling suspicions of orchestrated smears.

*Government Reforms vs. Digital Onslaught.* NDA’s efforts contrast sharply. Beyond funds, the department enforces hygiene protocols and devotee-friendly policies. Minister Anam has issued guidelines for staff accountability and better services, earning praise. “Positive changes are evident: discipline, cleanliness, comfort,” noted a Bhimavaram devotee.

Yet, influencers persist. “Views over values? How long will faith be gambled for clicks?” questioned a Eluru journalist covering local events. Experts warn social media, a powerful tool, turns weapon when irresponsible—breeding distrust, unrest, division.