The Desk…Bhimavaram : మావుళ్లమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్- RRR

The Desk…Bhimavaram : మావుళ్లమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్- RRR

🔴పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

అమ్మవారిని ఉండి శాసన సభ్యులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మరియు వేదపండితులు పూర్ణకుంభంతో వీరికి స్వాగతం పలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం వీరికి అందచేసారు.

దర్శనం అనంతరం RRR మీడియాతో మాట్లాడుతూ..

భీమవరం ప్రాంతానికి ప్రధాన ఉత్సవం అత్యంత ఘనంగా జరిపే సంక్రాంతి మహోత్సవాలు విజయవంతం కావాలని, ఉత్సవ నిర్వాహకులైన దేవస్థానం అధికారులు, నీరుల్లి, పండ్ల వర్తకసంఘం వారికి అభినందనలు తెలియచేస్తూ.. ప్రజలoదరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్టు తెలిపారు.

అమ్మవారిని దర్శించుకున్న తాడేపల్లిగూడెం MLA, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఆలయ అర్చకులు మరియు వేదపండితులు పూర్ణకుంభంతో వీరికి స్వాగతం పలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం బొలిశెట్టి శ్రీనివాస్ కు అందచేసారు.