🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో కూడిన జీవితం అందాలని కోరుకుంటున్నానన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు పార్లమెంటు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు ఎంపీ ఒక లేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, యువనేత నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీ, కూటమి పార్టీల నేతల సహకారంతో ఏలూరు పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల ముందు నేను ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చగలిగానని చెప్పిన ఎంపీ, గత ఏడాది కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు నా శాయశక్తులా కృషి చేశానని తెలిపారు.
ముఖ్యంగా 2025 సంవత్సరంలో పొగాకు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా సీలింగ్ తొలగించి అదనపు పొగాకు కొనుగోళ్లకు అవకాశం కల్పించటం, పామాయిల్ పంటకు గిట్టుబాటు ధర లభించేట్లు చేయటం, 13ఆర్వోబీలు మంజూరు చేయించటం, కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ పై DPR రెడీ చేయించి ఒక ముందడుగు వేయటం, జిల్లాలో కొత్త పరిశ్రమలకు శంకుస్థాపనలు జరగటం, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కోటి రూపాయల విలువైన పరికరాలు అందించటం, పోలవరం ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకురావటం, ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేకపోతున్న పేదలకు CMRF తో పాటు PMRF ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే 3 కోట్లకు పైగా ఆర్ధిక సాయం అందించటం వంటి కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు.
నూతన సంవత్సరంలో కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానని, నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంటు అభివృద్ధిలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు మరియు కొత్త విజయం కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.

