🔴 నెల్లూరు : ది డెస్క్ :
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ…:
దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా, భారత ప్రజాస్వామ్యానికి మార్గదర్శకుడు, విలువల రాజకీయాలకు ప్రతీక అని కొనియాడారు. భిన్న భావజాలాల మధ్య సమన్వయం సాధిస్తూ, విపక్షాలను గౌరవించే రాజకీయ సంస్కృతిని దేశానికి అలవాటు చేసిన గొప్ప నేత వాజ్ పేయి అని మంత్రి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందని అన్నారు.
ప్రధానిగా దేశాన్ని నడిపిన కాలంలో పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారత గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ధీరుడు అని…అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి స్వర్ణచతుర్భుజ ప్రాజెక్టుతో దేశ అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు, శాంతి, సమరసతలతో కూడిన విదేశాంగ విధానానికి పునాది వేసిన మహానాయకుడుగా వాజ్ పేయి చిరస్మరణీయులని మంత్రి ఆనం తెలిపారు.
అటల్ బిహారీ వాజ్ పేయి రాజకీయ జీవితం యువతకు ఒక ప్రేరణ, ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శకం అని పేర్కొన్నారు. దేశం, సమాజం, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

