- ఈనెల 27న గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా..
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.27.12.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీ.కె.బాలాజీ తెలియజేసారు.
జాబ్ మేళాలో జోయాలుక్కాస్ జ్యూవెలరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.
కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బి. ఫార్మసి పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, డిసెంబర్ 27న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమెలతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

