🔴 నెల్లూరు : ది డెస్క్ :
మళ్ళీ విభజన పేరుతో రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని విన్నవిస్తూ రాపూరు మండల జాయింట్ యాక్షన్ కమిటీ నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్దకు నేటి రాత్రి పెద్ద ఎత్తున చేరుకొని తమ బిడ్డల భవిష్యత్తును, కుటుంబాల భవితను పరిరక్షించాలని వేడుకుంటూ రాపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఇతర అన్ని వర్గాల నేతలు కలిసి విన్నవించుకున్నారు.
ఈ విషయం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసు కెళ్తామని తప్పక న్యాయం జరిగేలా కృషి చేస్తామని వారికి ఈ సందర్భంగా మంత్రి ఆనం వారికి హామీ ఇచ్చారు. రాపూరు తో తమ కుటుంబ అనుబంధం ఎవరూ విడదీయలేరని కొంత మంది రాజకీయ స్వార్థంతో ప్రజలను మభ్యపెట్టే ఉపన్యాసాలు ఎవరూ నమ్మరని మూడు మండలాల ప్రజలకు స్థానిక శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తో కలిసి న్యాయం జరిగేలా అన్ని సమస్యలను తప్పక సమిష్టిగా పరిష్కరిస్తామనీ మంత్రి ఆనం తెలిపారు.

