The Desk…Nellore : రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం

The Desk…Nellore : రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

కరుణామయుడు, లోక రక్షకుడు ఏసుప్రభువు జన్మించిన పర్వదినం క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులందరికీ మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస, పరోపకారం వంటి ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. క్రిస్టియన్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతీస్తుందని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ ఏసుప్రభు కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.