The Desk…Eluru : ఎంపీ కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

The Desk…Eluru : ఎంపీ కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు శాంతి నగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ జరిగింది. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, వైద్యం కోసం ఆర్ధిక సాయం కోరుతూ ఎంపీ కార్యాలయానికి వచ్చిన 66 మంది లబ్ధిదారులకు 45 లక్షలు విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఆర్ధిక  పరిస్థితి సహకరించక, వైద్యం చేయించుకునే స్థోమతు లేక ఇబ్బందులు పడుతున్న తమను CMRF ద్వారా ఆదుకున్న ఎంపీ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయ సిబ్బంది, పోలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.