The Desk…Tirumala : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్యుల‌కే పెద్ద‌పీట‌ : మంత్రి ఆనం

The Desk…Tirumala : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్యుల‌కే పెద్ద‌పీట‌ : మంత్రి ఆనం

  • ప‌దిరోజుల్లో 182 గంట‌ల ద‌ర్శ‌న స‌మ‌యంలో 164 గంట‌లు సామాన్యుల‌కే కేటాయింపు
  • -డిప్ లో టోకెన్లు పొందిన భ‌క్తులంద‌రూ నిర్దేశిత స‌మ‌యంలోనే తిరుమ‌ల‌కు చేరుకోవాలి
  • ఏఐ టెక్నాల‌జీతో క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ :

వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఏర్పాట్ల‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌మీక్షలో దేవాదాయ‌శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి

తిరుపతి జిల్లా : తిరుమ‌ల‌ : ది డెస్క్ :

రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామ‌న్యుల‌కే పెద్ద‌పీఠ వేస్తున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో సోమ‌వారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘంలోని రాష్ట్ర హోంశాఖ‌ మంత్రి అనిత‌, రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ల‌తో క‌లిసి ఆయ‌న టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశంలోని ముఖ్యాంశాలు

  • ప‌దిరోజుల్లో 182 గంట‌ల ద‌ర్శ‌న స‌మ‌యంలో 164 గంట‌లు అంటే దాదాపు 90శాతం సామాన్యుల‌కే కేటాయింపు.
  • ప‌ది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు పటిష్ట ఏర్పాట్లు.
  • తొలి మూడు రోజుల ద‌ర్వ‌నాల‌కు 27 రాష్ట్రాల నుండి 23.64 ల‌క్ష‌ల మంది ఈ-డిప్ కు న‌మోదు
  • 1.89 ల‌క్ష‌ల మంది సామాన్య భ‌క్తుల‌కు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.
  • భ‌క్తులు ఏరోజు, ఏ స‌మ‌యానికి ద‌ర్శ‌నానికి రావాలో స‌మాచారం అంద‌జేత‌.
  • టోకెన్ లేని భ‌క్తులు జ‌న‌వ‌రి 2 నుండి 8వ తేది వ‌ర‌కు స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలకు అవ‌కాశం.
  • స్వామివారి ద‌ర్శ‌నాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు విరివివిగా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, త‌దిత‌ర స‌దుపాయాలు.
  • ఏఐ టెక్నాల‌జీతో క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, భ‌క్తుల సంఖ్య‌, వేచి ఉండే స‌మ‌యాన్ని అంచ‌నా వేస్తూ క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌.

పోలీసులు, టీటీడీ విజిలెన్స్ స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు.

  • అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని సంయ‌మ‌నంతో స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి.
  • భ‌క్తుల‌కు పూర్తిస్థాయిలో సంతృప్తి క‌లిగేలా నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లు అందించాల‌ని సిబ్బందికి సూచ‌న‌.

ఈ స‌మావేశంలో టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, దేవాదాయ‌శాఖ సెక్ర‌ట‌రీ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్‌, ఎస్పీ సుబ్బ‌రాయుడు, సీవీఎస్వో ముర‌ళీ కృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.