The Desk…Machilipatnam : ఈనెల 24న ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని “NAC ట్రైనింగ్ సెంటర్” నందు జాబ్ మేళా..

The Desk…Machilipatnam : ఈనెల 24న ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని “NAC ట్రైనింగ్ సెంటర్” నందు జాబ్ మేళా..

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.24.12.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీ నందు గల “NAC ట్రైనింగ్ సెంటర్(Old BC Girls Hostel)” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్, పేటిఎమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఫార్మసి పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, డిసెంబర్ 24న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981368429 , 8885159008 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.