The Desk…Bhimadole : ▪️పర్యావరణం▪️స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర

The Desk…Bhimadole : ▪️పర్యావరణం▪️స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర

🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :

భీమడోలు గ్రామ పంచాయితీ “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర.. “పర్యావరణం” కార్యక్రమములో భీమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ ఆధ్వర్యంలో జరిగింది..ఈ కార్యక్రమం లో భాగంగా… రాష్ట్ర APCOB ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు SWPC షెడ్డు వద్ద మొక్కలు నాటి స్వర్ణాంధ్ర _ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసారు

సందర్భంగా వారు మాట్లాడుతూ..

ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటి పరిసరాల వద్ద అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని, అలాగే విషవాయువులను వాతావరణం నుండి తొలగించి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, గాలిని, నీటిని ఫిల్టర్ చేసి, పరిసరాలను చల్లబరుస్తాయని, శబ్ద కాలుష్యాన్ని 40% వరకు తగ్గించి, వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం అందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భీమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ, భీమడోలు , గణపవరం, నిడమర్రు తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, రామకృష్ణంరాజు, ముత్యాల స్వామి , గుండుగొలను సొసైటీ అధ్యక్షుడు కొండబాబు, AMC చైర్మన్ శేషపు శేషగిరి, నీటి సంఘం అధ్యక్షులు కుక్కల ప్రసాద్, నాయకులుప్రవీణ్ పటేల్,ఆదిరెడ్డి సత్యనారాయణ, పైడిమాల యుగంధర్,మారిశెట్టి ప్రసాద్, వాసు, మూర్తి, రమేష్ , అజయ్, రామక్రిష్ణ ,VRO వినయ్,పంచాయితీ పాలకవర్గం సభ్యులు, సచివాలయం సిబ్బంది, మరియు కూటమి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.