🔴 నెల్లూరు జిల్లా : మాక్తాపురం : ది డెస్క్ :
అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేసుకుంటూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం సంగం మండలం మాక్తాపురం గ్రామంలో రూ. 63 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే రూ. 32 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు.
గ్రామానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని శివాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సందర్శించారు. శివాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకారం అందించాలని గ్రామస్తులు మంత్రిని కోరగా, దేవాదాయ శాఖ అధికారులను పంపించి అంచనాలు తయారు చేయించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ:
తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 18 నెలల కాలంలో అభివృద్ధిని పట్టాలెక్కిస్తూ కోట్లాది రూపాయలతో గ్రామాల్లో మౌలిక వసతులకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మక్కా పురం గ్రామంలో ఈ ఒక్క రోజే అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. ఈ ఒక్క గ్రామంలోనే ప్రతి నెలా 209మందికి రూ. 1.33 కోట్లు సామాజిక పింఛన్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 11మందికి రూ. 15వేలు చొప్పున చెల్లించినట్లు చెప్పారు.
తల్లికి వందనం పథకం కింద 182 మందికి 27.30 లక్షలు జమ చేశామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ఒక్క సంగం మండలంలోనే 143 వివిధ పనులకు 12.96 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా మంత్రి ఆనం ధన్యవాదాలు తెలిపారు.
అలాగే సంగం మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాలకు రూ. 2.72 కోట్లు మంజూరైనట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే టెండర్లు పూజ చేసి పందులు మొదలు పెడతామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ గ్రామాలకు ఏం కావాలో అన్నీ తెలుసుకుని ఆయా ప్రాంతాలను కోట్లాది రూపాయలు వెచ్చించి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు
పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : మంత్రి ఆనం
విద్యుత్ పొదుపుతో పాటు ఆదాయాన్ని సమకూర్చే అనేక ప్రయోజనాలు ఉన్న ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ను ప్రజలకు చేరువ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు.
బీసీలకు కూడా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో పాటు 20వేలు రూపాయలు సబ్సిడీ అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గానికి పదివేల కనెక్షన్లు మంజూరు అయినట్లు చెప్పారు. ఈ గొప్ప అవకాశాన్ని ప్రజలందరూ అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆనం పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్డీవో పావని, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బరాజు, తాసిల్దార్ సోమ్లా నాయక్, స్థానిక నాయకులు చెన్నూరు మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి, కేశవ చౌదరి, గిరి నాయుడు, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

