గుంటూరు జిల్లా : మంగళగిరి రూరల్ సర్కిల్ : ది డెస్క్ :
అంతర్‌జిల్లా దొంగల ముఠా ను అరెస్ట్ చేసినట్లు మంగళగిరి పోలీసు స్టేషన్ సర్కిల్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దొంగతనాల కేసులపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అంతరజిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండిను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.. దొంగతనానికి గురైన ఆభరణాలను కొనుగోలు చేసిన, తాకట్టు పెట్టుకున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు..ఈ ముఠాపై మంగళగిరి రూరల్, డీకే దిన్నె, దువ్వాడ, గాజువాక, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్టు వివరాలు వెల్లడించారు..
అరెస్టయిన నిందితులు తోట శివకుమార్ (36), షేక్ ఇంతియాజ్ (26), తోట వరలక్ష్మి (31)గా పోలీసులు గుర్తించారు. వీరు విశాఖపట్నం, కడప జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.పిర్యాదుదారు భూక్య వీరాంజనేయులు నాయక్ (37), యర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దర్యాప్తులో ప్రధాన నిందితుడు తోట శివకుమార్‌పై రాష్ట్రవ్యాప్తంగా 150కు పైగా దొంగతన కేసులు ఉన్నట్టు బయటపడింది. నిందితుడు కడప జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో షేక్ ఇంతియాజ్‌తో పరిచయం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం శివకుమార్, ఇంతియాజ్, వరలక్ష్మి కలిసి దొంగతనాలకు పూనుకున్నట్టు తెలిసింది.
నవంబర్ 4న ముగ్గురు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి మంగళగిరి మండలం ఎర్రబాలెం ప్రాంతంలో రేకీ నిర్వహించారు. రాత్రి సమయంలో ఒక ఇంటిలోకి ప్రవేశించి వెండి పట్టీలు, చెవి దిద్దులు, బంగారు మాటీలు, నగదు రూ.20,000 దొంగిలించినట్టు విచారణలో తేలింది. అనంతరం కడప, దువ్వాడ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి స్వాధీనం చేసిన ఆభరణాలను కోర్టుకు సమర్పించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై బాలు నాయక్, ఏఎస్సై రత్నరాజు, పోలీసు కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు.

