The Desk…Mudinepalli : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అఖండ అన్న సమారాధనలో ఎమ్మెల్యే డా. కామినేని

The Desk…Mudinepalli : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అఖండ అన్న సమారాధనలో ఎమ్మెల్యే డా. కామినేని

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని చేవూరు పాలెం- సింగరాయపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అఖండ అన్న సమారాధన ఆదివారం పెద్ద ఎత్తున జరిగింది. స్వామివారి దేవస్థానం నందు షష్టి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని దేవస్థానం సిబ్బంది, ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భారీ అఖండ అన్న సమారాధనను ప్రారంభించారు.

ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. అన్నసమారాధన ఏర్పాట్లు చాలా చక్కగా భారీగా ఏర్పాటు చేసారని.. ప్రతి ఒక్కరు స్వామి వారినీ దర్శించుకుని ప్రసాదం స్వీకరించి వెళ్లేలా చూడాలని ఉత్సవ కమిటీ సభ్యులకి దిశానిర్దేశం చేసారు. అనంతరం అన్నసమారాధనకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.